News October 30, 2024
ఏపీలో ఓటర్లు 4.14 కోట్లు
AP: రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. జనవరి నుంచి కొత్తగా 10,82,841 మంది ఓటర్లు చేరారు. నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే జనవరి 6న తుది జాబితాను ఈసీ ప్రచురించనుంది.
Similar News
News November 5, 2024
తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్
TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.
News November 5, 2024
రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచనలో శరద్ పవార్!
రాజకీయాలకు స్వస్తి పలకాలని శరద్ పవార్ (83) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బారామతి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘రాజ్యసభ MPగా ఏడాదిన్నర పదవీకాలం మిగిలింది. ఇప్పటివరకు పోటీ చేసిన 14 ఎన్నికల్లో ప్రతిసారీ నన్ను గెలిపించారు. ఇక ఎక్కడో ఒకచోట ఆపేయాలి. రాబోయే 30 ఏళ్లపాటు పనిచేసే కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మంచి చేయడానికి రాజకీయాలు అవసరం లేదన్నారు.
News November 5, 2024
రాంగ్ రూట్‌లో వెళ్తే రూ.2,000 ఫైన్
హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ పకడ్బందీగా అమలులోకి వచ్చాయి. రూల్స్ బ్రేక్ చేస్తే మునుపటిలా చూసీచూడనట్లు వదిలేయడం ఇక ఉండదు. హెల్మెట్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే రూ.200 ఫైన్ వేస్తారు. రాంగ్ రూట్‌లో నడిపితే రూ.2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌పై సస్పెన్షన్ కూడా విధిస్తారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.