News April 27, 2024
ఒకే ఓవర్‌లో 4, 4, 6, 4, 4, 4

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ వీర విహారం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ల్యూక్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో ఊచకోత కోశారు. వరుసగా 4, 4, 6, 4, 4, 4 బాదారు. దీంతో ఒకే ఓవర్‌లో 26 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ స్కోర్ 18.1 ఓవర్లకు 235/4గా ఉంది.
Similar News
News July 8, 2025
YSRకు TPCC ఘన నివాళులు

TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర పార్టీ నేతలు నివాళుర్పించిన వారిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
News July 8, 2025
లండన్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా

ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా లండన్ చేరుకుంది. హీత్రూ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆటగాళ్లు నేరుగా హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఎల్లుండి (ఈ నెల 10న) ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు 5 టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా కొనసాగుతున్నాయి.
News July 8, 2025
మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకు నిధులు విడుదల

TG: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల పెండింగ్ జీతాలు రూ.150 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నిధుల జమ కానుండగా, ఒకట్రెండు రోజుల్లో 53 వేల మంది మల్టీ పర్పస్ వర్కర్లు తమ జీతాలు అందుకోనున్నారు.