News April 3, 2024

ఒకే ఓవర్లో 4, 6, 6, 4, 4, 4

image

కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ రెచ్చిపోయారు. వెంకటేశ్ అయ్యర్ వేసిన ఒక ఓవర్‌లో 28 రన్స్ బాదారు. ఆ ఓవర్లో 4, 6, 6, 4, 4, 4 కొట్టారు. దీంతో పంత్ (55) అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆయన ఔటయ్యారు. పంత్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీ విజయానికి 42 బంతుల్లో 144 రన్స్ కావాలి.

Similar News

News April 22, 2025

48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.

News April 22, 2025

అద్భుతం.. 10Gbps వేగంతో డౌన్‌లోడ్

image

చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటగా 10Gbps వేగంతో పనిచేసే 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లో టెస్టు చేయగా 9834 Mbps గరిష్ఠ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. ఈ వేగంతో రెండు ఫుల్ 4k క్వాలిటీ సినిమాలను ఒక్క సెకన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ రంగాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.

News April 21, 2025

ఆ చైనా యాప్ తీసేయండి.. గూగుల్‌కు భారత్ సూచన

image

చైనాకు చెందిన వీడియో చాటింగ్ యాప్ ‘యాబ్లో’(Ablo)ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. అందులో భారత భూభాగాల్ని తప్పుగా చూపించడమే దీనికి కారణం. జమ్మూకశ్మీర్, లద్దాక్‌ను భారత భూభాగాలుగా చూపించని ఆ యాప్, లక్షద్వీప్‌ను మొత్తానికే మ్యాప్‌ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే భారత సార్వభౌమత్వాన్ని గౌరవించని ఆ యాప్‌ను తొలగించాలని గూగుల్‌కు భారత్ తేల్చిచెప్పింది.

error: Content is protected !!