News August 26, 2024
23 ఏళ్లలో 40 వేల అత్యాచార కేసులు: అస్సాం సీఎం
రాష్ట్రంలో 2001-24(జులై) మధ్య కాలంలో 40వేల అత్యాచార కేసులు నమోదైనట్లు అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ తెలిపారు. తమ ప్రభుత్వం అత్యాచారాలను నిర్మూలించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకే ప్రయత్నిస్తుందని చెప్పారు. కాగా 2020 నుంచి ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు.
Similar News
News September 10, 2024
గ్లోబల్ స్టేజ్‌పై భారత్‌ను విస్మరించలేరు: కాంగ్రెస్ ఎంపీ
ప్రపంచ ఆర్థిక, రాజకీయాల్లో అత్యంత కీలకమైన భారత్‌ను విస్మరించరాదని, అలాగే తక్కువ అంచనా వేయలేరని కాంగ్రెస్ MP శశి థరూర్ స్పష్టం చేశారు. ‘వేగంగా పెరుగుతున్న జనాభా, ఎకానమీ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను అత్యంత కీలకంగా మార్చేశాయి. జియో పాలిటిక్స్‌లో చైనా, పాక్, USతో సవాళ్లు ఎదురవుతున్నా సమతూకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకొనే నిర్ణయాలు ప్రపంచంపై సుదీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి’ అని అన్నారు.
News September 10, 2024
నేను ప్రతిపక్షంలోనే ఉన్నా: MLA గాంధీ
TG: తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని శేరిలింగంపల్లి MLA అరికెపుడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానింకా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని వెల్లడించారు. తనకు CM రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, ఆలయానికి సంబంధించిన శాలువా అని చెప్పారు. గాంధీ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని వార్తలు వినిపించాయి. ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై BRS అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించారు.
News September 10, 2024
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు
TG: HYDలోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ GHMC అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు పెట్టారు. పెద్ద ఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కాగా ఏటా నగరం నలువైపుల నుంచి భారీగా వినాయక విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే.