News January 24, 2025
400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యం!

యూపీ సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేల్లో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ అస్థిపంజరం బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్మారక ప్రదేశం 1920 నుంచి ASI రక్షణలో ఉంది.
Similar News
News January 7, 2026
లండన్ vs బెంగళూరు లైఫ్.. గూగుల్ ఇంజినీర్ పోస్ట్ వైరల్!

లండన్‌లో ₹1.3 కోట్ల జీతం కంటే బెంగళూరులో ₹45 లక్షలతోనే లైఫ్ బిందాస్‌గా ఉందని గూగుల్ ఇంజినీర్ వైభవ్ అగర్వాల్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. లండన్‌లో అద్దెలు, పన్నులు పోనూ ఏమీ మిగలదని, పనులన్నీ మనమే చేసుకోవాలని పేర్కొన్నారు. అదే బెంగళూరులో పనిమనుషులు, తక్కువ ఖర్చుతో లగ్జరీ లైఫ్ అనుభవించ వచ్చని లెక్కలతో వివరించారు. క్వాలిటీ లైఫ్‌స్టైల్ కోసం లండన్, లగ్జరీ, కంఫర్ట్ కోసం బెంగళూరు బెటర్ అని తేల్చారు.
News January 7, 2026
ఫోన్ ట్యాపింగ్.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్‌రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఇటీవల నవీన్‌రావు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
News January 7, 2026
పండుగకి ఊరెళ్తున్నారా?

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇల్లు విడిచి వెళ్లేముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించడం శ్రేయస్కరం. ఇంటికి రెండు ద్వారాలు ఉంటే రహదారికి కనిపించే తలుపుకు లోపల, మరో వైపున్న తలుపుకు బయటివైపు తాళం వేయాలి. ఆ తాళం బయటకు కనిపించకుండా కర్టైన్స్ వేయడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో బంగారం, నగదు వదిలి వెళ్లవద్దని కోరుతున్నారు.


