News January 24, 2025

400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యం!

image

యూపీ సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేల్లో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ అస్థిపంజరం బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్మారక ప్రదేశం 1920 నుంచి ASI రక్షణలో ఉంది.

Similar News

News February 16, 2025

IPL-2025: ఏ జట్టుకు ఏ రోజు మ్యాచ్(FULL LIST)

image

ఐపీఎల్ 18వ సీజన్‌ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. మొత్తం పది టీమ్‌(KKR, SRH, RCB, CSK, MI, DC, PBKS, GT, LSG, RR)లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఏ జట్టు ఏ రోజు ఎవరితో ఏ వేదికలో మ్యాచ్ ఆడనుంది? పూర్తి జాబితాను పై ఫొటోల్లో చూడవచ్చు.

News February 16, 2025

మిస్డ్ కాల్‌కు తిరిగి కాల్ చేస్తే అంతే సంగతులు

image

గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దన్నారు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930ను సంప్రదించాలన్నారు.

News February 16, 2025

నీతా అంబానీకి అరుదైన గౌరవం

image

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. దార్శనికత, దాతృత్వం, సామాజిక సేవలతో గ్లోబల్ ఛేంజ్‌మేకర్‌గా నిలుస్తున్నారని USAలోని మసాచుసెట్స్ ప్రభుత్వం కొనియాడింది. విద్య, ఆరోగ్యం, స్పోర్ట్స్, తదితర రంగాల్లో ఆమె సేవలు గొప్పవని పేర్కొంది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ ప్రశంసాపత్రం’ అందజేసింది. బోస్టన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ హీలీ అవార్డ్ అందజేసినట్లు నీతా అంబానీ ఆఫీస్ తెలిపింది.

error: Content is protected !!