News November 7, 2024
ఏడాదిలో 4000 ATM మెషీన్లు క్లోజ్!
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర కూడా UPI పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. UPI, డిజిటల్ చెల్లింపుల కారణంగా భారతీయ బ్యాంకులు ATM మెషీన్లను మూసివేసే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాదిలోనే 4000 ATM మెషీన్లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ₹34.70 లక్షల కోట్ల నగదు చలామణి ఉంది. కాగా, దేశంలో లక్ష మందికి 15 ATMలు మాత్రమే ఉన్నాయి.
Similar News
News December 8, 2024
కేజీ చికెన్ ధర ఎంతంటే?
కార్తీక మాసం తర్వాత పెరుగుతాయనుకున్న చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. కొన్ని చోట్ల యథాతథంగా ఉన్నాయి. HYDలో కేజీ చికెన్ రూ.180 నుంచి రూ.230 వరకు ఉంది. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతిలోగా పెరగవచ్చని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు కోడిగుడ్ల ధర పెరుగుతోంది. ఒక కోడిగుడ్డుకు రిటెయిల్ ధర రూ.7గా ఉంది. హోల్సేల్లో రూ.6.50 పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంతుంది?
News December 8, 2024
ధర్నాలకు కేరాఫ్ తెలంగాణ: బీఆర్ఎస్
TG: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలోని సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయని BRS ట్వీట్ చేసింది. KCR పాలనలో అభివృద్ధిలో పరుగులు తీసిన రాష్ట్రం, నేడు రేవంత్ ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొంది. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఆఖరికి పోలీసులు కూడా రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని, సమస్యలు చెప్పుకునేందుకు కూడా కాంగ్రెస్ అవకాశం ఇవ్వడం లేదని విమర్శించింది.
News December 8, 2024
PM కిసాన్ రూ.12వేలకు పెంచాలని డిమాండ్
వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. PM కిసాన్ వార్షిక సాయాన్ని ₹6K నుంచి ₹12Kకు పెంచాలని కోరారు. PM ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రీబడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నవించారు. పురుగుమందులపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని PHD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది.