News January 12, 2025

రిపబ్లిక్ డే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 41 మంది

image

TG: న్యూఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు 41 మంది రాష్ట్ర వాసులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాజేశ్వర్ ఉండనుండగా ట్రెయినీ డీజీటీ శ్రావ్యతో పాటు మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

Similar News

News November 14, 2025

BRSకు స్వల్ప ఆధిక్యం

image

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది.

News November 14, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా<<>> బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై, NISM/NCFM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers

News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.