News January 12, 2025
రిపబ్లిక్ డే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 41 మంది

TG: న్యూఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు 41 మంది రాష్ట్ర వాసులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాజేశ్వర్ ఉండనుండగా ట్రెయినీ డీజీటీ శ్రావ్యతో పాటు మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News February 19, 2025
GOOD NEWS.. ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు

AP: BC, EWS కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో 1.25 లక్షల BC, 45వేల EWS దరఖాస్తులు రాగా నిన్నటి నుంచి ఎంపిక ప్రారంభించారు. FEB 25లోగా లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్ ఆమోదిస్తారు. MAR 8-12 వరకు ఆయా కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. MAR 17 నుంచి 20 మధ్య లబ్ధిదారులకు చేరుతుంది.
News February 19, 2025
బాలీవుడ్ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ మూవీ?

యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’తో దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ఈ డైరెక్టర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో కథను రెడీ చేశారని సమాచారం. విజయ్ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’లో నటిస్తున్న విజయ్ ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌తోనూ సినిమాకు ఒకే చెప్పారు.
News February 19, 2025
నిన్న నియామకం.. నేడు కోర్టు విచారణ

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక నిబంధనల మార్పుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. గతంలో CJI, ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానెల్ CEC, ECలను నియమించేది. ఇందులో నుంచి CJIని తొలగిస్తూ, ఒక కేంద్రమంత్రిని చేరుస్తూ NDA ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారమే జ్ఞానేశ్ కుమార్‌ను CECగా కేంద్రం సోమవారం అర్ధరాత్రి నియమించింది. కేంద్రం తీరును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.