News February 12, 2025
42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఆర్ కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
Similar News
News March 18, 2025
సునీత.. మీరు భారత్ రావాలి: ప్రధాని మోదీ

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు PM మోదీ లేఖ రాశారు. తొలుత భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపిన ఆయన వేల మైళ్ల దూరంలో ఉన్నా ఎప్పుడూ తమ హృదయాలకు దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. తానెప్పుడు బైడెన్, ట్రంప్‌ను కలిసినా సునీత బాగోగుల గురించి అడిగినట్లు తెలిపారు. భూమి మీదకు తిరిగొచ్చిన తర్వాత భారత్ సందర్శనకు రావాలని కోరారు. తనకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తామని మోదీ తెలిపారు.
News March 18, 2025
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

TG: BRS నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
News March 18, 2025
ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో AP టాప్: ADR

దేశవ్యాప్తంగా 4,092 మంది MLAలలో 1,861 మంది(45%)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వారిలో 1,205 మందిపై తీవ్రమైన కేసులు(మర్డర్, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు) ఉన్నట్లు తెలిపింది. ‘79% మంది(138/174) MLAలపై కేసులతో AP టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత కేరళ, TG(69%), బిహార్(66%), మహారాష్ట్ర(65%), TN(59%) ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లోనూ AP అగ్రస్థానంలో ఉంది’ అని పేర్కొంది.