News March 18, 2024
420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు: ప్రకాశ్‌రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘420(మోసాలు) పనులు చేసిన వాళ్లు వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపుపై మాట్లాడుతున్నారు. వారు ఏ పార్టీ అయినా కావొచ్చు. ఇది వారి అహంకారానికి నిదర్శనం. ఒక పార్టీ 400 సీట్లలో గెలవడం సాధ్యం కాదు’ అని స్పష్టం చేశారు. కాగా తాము సింగిల్‌గా 370 సీట్లు, NDA కూటమికి 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
Similar News
News December 11, 2025
పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో పిల్లల్ని పెంచడం అనేది కత్తిమీద సాములా మారింది. కొందరు తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛను ఇస్తుంటే.. మరికొందరు అతి క్రమశిక్షణతో పంజరంలో పక్షుల్లా పెంచుతున్నారు. ఈ రెండు విధానాల వల్ల పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. వారికి ముఖ్యంగా పరోపకార గుణం, యాంగర్ మేనేజ్‌మెంట్, గౌరవం, ప్రేమానురాగాలు, బాధ్యత, కార్యదక్షత, తప్పును అంగీకరించడం, సమయపాలన నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
దయనీయ స్థితిలో పావలా శ్యామల.. ఆత్మహత్యకు యత్నిస్తూ!

ప్రముఖ నటి పావలా శ్యామల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆదుకునేవారే లేకపోవడంతో ఆమె జీవనం అగమ్యగోచరంగా మారింది. దీంతో మంచానికే పరిమితమైన తల్లీకూతుళ్లను హోమ్ నిర్వాహకులు బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. రోడ్డుపై దయనీయస్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీరిని పోలీసులు గుర్తించి ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. దీనిపై సినీ పెద్దలు ఎవరూ స్పందించలేదు.
News December 11, 2025
‘అలాంటి వరి రకాల సాగును ప్రోత్సహించాలి’

ప్రజలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే వరి రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా ఎగుమతికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సుబాబుల్ రైతులకు మంచి ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ, ఇతర ఉద్యానపంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.


