News April 2, 2024
అందం కోసం 43 సర్జరీలు.. ఎలా మారిందో చూడండి!

ఇరాక్కు చెందిన దాలియా నయీమ్(30) అనే యువతి బార్బీగర్ల్లా మారడం కోసం ఏకంగా 43 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. ముఖం, ముక్కు, వక్షోజాలకు ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఆమె పెదవులు లావుగా అయిపోయి ఫేస్ విచిత్రంగా మారిపోయింది. కొందరు ఆమెను జాంబీ గర్ల్, డెవిల్ బార్బీ అని పిలుస్తున్నారు. దాలియాకు ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Similar News
News November 13, 2025
బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించడంలో సహాయపడతాయి. చర్మసంరక్షణలో దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.
News November 13, 2025
పరిస్థితి తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: SC

ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్గా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.
News November 13, 2025
కనకాంబరం పూల సేకరణకు ఇదే అనువైన సమయం

కనకాంబరం సాగు తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. ఈ మొక్కలు నాటిన 2 నుంచి 3 నెలలకు పూత ప్రారంభమై, ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుంచి జనవరి వరకు దిగుబడి ఎక్కువగా, వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. కనకాంబరం పూలను సరైన సమయంలో సేకరిస్తే అవి తాజాగా ఉండి మంచి ధర వస్తుంది. కనకాంబరం పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూలు కోయాలి.


