News April 2, 2024
అందం కోసం 43 సర్జరీలు.. ఎలా మారిందో చూడండి!

ఇరాక్‌కు చెందిన దాలియా నయీమ్(30) అనే యువతి బార్బీగర్ల్‌లా మారడం కోసం ఏకంగా 43 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. ముఖం, ముక్కు, వక్షోజాలకు ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఆమె పెదవులు లావుగా అయిపోయి ఫేస్ విచిత్రంగా మారిపోయింది. కొందరు ఆమెను జాంబీ గర్ల్, డెవిల్ బార్బీ అని పిలుస్తున్నారు. దాలియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Similar News
News April 19, 2026
పవన్ త్వరగా కోలుకోవాలి.. చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష

శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం <<19685329>>పవన్ కళ్యాణ్<<>> త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఆయన డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాలని లోకేశ్ కోరారు. పవన్ ఆరోగ్యవంతుడై మళ్లీ ప్రజా సేవలో బిజీ కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
News April 19, 2026
బబుల్ గమ్ మింగితే ఏమవుతుంది?

బబుల్ గమ్ మింగితే ఏళ్లపాటు అది కడుపులోనే ఉండిపోతుందనేది అపోహ మాత్రమేనని వైద్యులు తేల్చిచెప్పారు. ‘జీర్ణం కాకపోయినా ఆహారనాళం నుంచి కడుపులోకి, అక్కడి నుంచి పేగుల్లోకి ప్రయాణించి 4-5 రోజుల్లో మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు ఎక్కడా అతుక్కోదు. కడుపు నొప్పి, వాంతుల లాంటి సమస్యలూ రావు. పొరపాటున మింగితే కంగారు పడాల్సిన పనిలేదు. అలా అని కావాలని మింగొద్దు’ అని డాక్టర్లు చెబుతున్నారు.
News April 19, 2026
విపక్షాలపై మోదీ ‘భ్రూణ హత్య’ అస్త్రం!

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని మోదీ ‘భ్రూణ హత్య’తో పోల్చడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణ విమర్శల కంటే ఇలాంటి భావోద్వేగ పదాలు వాడటం వల్ల మహిళా ఓటర్లలోకి సందేశం బలంగా వెళ్తుందని BJP భావన. విపక్షాలు బిల్లును అడ్డుకోవడం అంటే ఒక గొప్ప ప్రయత్నాన్ని పురిట్లోనే చంపేయడమేనని మోదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పదం రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.


