News December 9, 2024
యుద్ధంలో 43వేల మంది సైనికులు మృతి: జెలెన్స్కీ

రష్యాతో యుద్ధంలో 43వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దాదాపు మూడేళ్లుగా చేస్తున్న యుద్ధంలో మరో 3.70లక్షల మంది గాయపడ్డారన్నారు. రష్యా 1.98లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందని చెప్పారు. అటు, ఇరుదేశాలు కాల్పుల విరమణ అమలు చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జెలెన్స్కీలతో నిన్న భేటీ అయిన ఆయన ఈ యుద్ధంలో ఇరుదేశాలు నష్టపోయాయన్నారు.
Similar News
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయంటే?

ఫైబ్రాయిడ్లు ఎందుకు ఏర్పడతాయన్న విషయంలో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, శరీరంలో జరిగే కొన్ని మార్పులు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత తలెత్తినప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పోషకాహార లోపం, చిన్న వయసులోనే రజస్వల అవడం, ఒత్తిడి దీనికి కారణాలంటున్నారు నిపుణులు.


