News June 19, 2024
ఈ ఏడాది దేశాన్ని వీడనున్న 4300మంది శ్రీమంతులు!
ఈ ఏడాది 4300మంది శ్రీమంతులు భారత్‌ను వీడనున్నారని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అంచనా వేసింది. అత్యధికులు యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 5100గా ఉండటం గమనార్హం. చైనా, యూకే తర్వాత ఆ స్థాయిలో మిలియనీర్లు తరలిపోతున్న దేశంగా భారత్ ఉందని వివరించింది. మొత్తంగా ఈ ఏడాది 1.28లక్షలమంది యూఏఈ లేదా అమెరికాకు వలస వెళ్తారని సంస్థ అభిప్రాయపడింది.
Similar News
News September 14, 2024
ఆధార్ FREE అప్డేట్ తేదీ పొడిగింపు
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే గడువును డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు UIDAI కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. పదేళ్లకు పైగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వారు, తమ డేటా వివరాల కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు సంబంధిత ఆధారాలను సమర్పించాలి. అడ్రస్, చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటివి సులభంగా మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేసేందుకు ఇక్కడ <
News September 14, 2024
సూర్యా.. భారత్‌కు మరెన్నో విజయాలు అందించు: జై షా
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఆయనకు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత టీ20ఐ కెప్టెన్, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్‌కు హ్యాపీ బర్త్ డే. పొట్టి ఫార్మాట్‌లో మన జట్టుకు మీరు మరెన్నో విజయాలకు సాధించిపెట్టాలి. బెస్ట్ విషెస్ ఫర్ ది ఇయర్ ఎహెడ్’ అని ట్వీట్ చేశారు. ఈరోజు సూర్య తన 34వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు.
News September 14, 2024
ట్రంప్, కమల ఇద్దరూ చెడ్డవాళ్లే: పోప్
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జీవనానికి వ్యతిరేకులేనని పేర్కొన్నారు. ‘ట్రంప్ వలసలకు వ్యతిరేకి. కమల అబార్షన్‌కు మద్దతునిస్తున్నారు. నేను అమెరికన్ కాదు. నాకు అక్కడ ఓటు లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వారిద్దరూ చేసేది పాపమే. అమెరికన్లు ఆ ఇద్దరిలో తక్కువ చెడ్డ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.