News August 26, 2024
4,455 బ్యాంక్ ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్

దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఈనెల 28తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఏదైనా డిగ్రీ చేసి, 1-8-2024 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపికలుంటాయి. ప్రిలిమ్స్ అక్టోబర్/నవంబర్లో జరిగే అవకాశం ఉంది.
వెబ్సైట్: <
Similar News
News November 25, 2025
ఇమ్యునిటీ తగ్గిందని తెలిపే లక్షణాలివే..

రోగనిరోధకశక్తి తగ్గితే తరచూ రోగాల బారిన పడతాం. అయితే ఇమ్యునిటీ తగ్గిందని కొన్ని లక్షణాలతో తెలుస్తుంది. తరచూ అనారోగ్యం బారిన పడటం, జీర్ణ సమస్యలు, గాయాలు మానడం ఆలస్యం కావడం, అధిక ఒత్తిడి వంటివి లో ఇమ్యునిటీ లక్షణాలు. సిట్రస్ ఫ్రూట్స్, చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, పప్పులు, గుమ్మడి, అవిసె, చియా విత్తనాలు, నువ్వులు, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది.

వేములవాడ: సత్తెమ్మకు చేరిన ‘పత్తి’ డబ్బు.. Way2News కథనానికి స్పందన

పత్తి రైతు సత్తెమ్మకు ఎట్టకేలకు డబ్బు చేతికి అందింది. సీసీఐకి పత్తి విక్రయించగా రూ.2,14,549 లను సత్తెమ్మ ఆధార్ లింక్ అయిన రాజన్న ఆలయ ట్రస్ట్ అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేశారు. తన డబ్బులు ఇవ్వాలంటూ సత్తెమ్మ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోగా, ఈ అంశాన్ని <<18381330>>Way2News<<>> వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించి డబ్బులు తిరిగి ఇచ్చారు.