News August 26, 2024

4,455 బ్యాంక్ ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్

image

దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఈనెల 28తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఏదైనా డిగ్రీ చేసి, 1-8-2024 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపికలుంటాయి. ప్రిలిమ్స్ అక్టోబర్/నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: <>ibpsonline.ibps.in<<>>

Similar News

News December 12, 2024

సినిమా షూటింగ్‌లో గాయపడ్డ అక్షయ్ కుమార్‌!

image

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్-5’ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ స్టంట్ చేస్తున్న సమయంలో ఒక వస్తువు ఆయన కంటికి తగిలినట్లు తెలిపాయి. సిబ్బంది వెంటనే నేత్ర వైద్యుడిని సెట్స్‌కి పిలిపించి చికిత్స చేయించినట్లు సమాచారం. ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారని తెలుస్తోంది. దీనిపై ఆయన టీమ్ స్పందించాల్సి ఉంది.

News December 12, 2024

గ్రేట్.. తొమ్మిది నెలల గర్భంతో భరతనాట్యం

image

భరతనాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు యజ్ఞికా అయ్యంగార్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి నృత్యం చేసి ఔరా అనిపించారు. గర్భవతి అయిన దేవకి, పుట్టబోయే కృష్ణుడి మధ్య మాతృ బంధాన్ని వెల్లడించే ‘మాతృత్వం’ అనే అంశంపై ఆమె ప్రదర్శన ఇచ్చారు. డాన్స్ చేసే సమయంలో తాను కడుపులోని పాప కూడా తన్నడాన్ని అనుభవించినట్లు చెప్పారు. దాదాపు గంటపాటు ప్రదర్శన ఇచ్చారు.

News December 12, 2024

ఆ దావాలను తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

image

ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.