News September 8, 2024
వరదలకు 45 మంది మృతి: రాష్ట్ర ప్రభుత్వం
AP: రాష్ట్రంలో వరదల కారణంగా 45 మంది మరణించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరులో ఏడుగురు మరణించారని పేర్కొంది. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 3,913 KMల మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిపింది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లు వెల్లడించింది.
Similar News
News October 12, 2024
కూతురి హత్యకు తల్లి సుపారీ.. మతిపోయే ట్విస్ట్ ఏంటంటే..
ప్రేమలో ఉన్న కూతురిని హత్య చేయించాలనుకుందో తల్లి. అందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కి సుపారీ ఇచ్చింది. అయితే ఆ కిల్లర్ తల్లినే చంపేశాడు. మతిపోయే ట్విస్ట్ ఏంటంటే.. కూతురి లవర్ ఆ కిల్లరే! ఈ నేరకథా చిత్రం యూపీలో చోటుచేసుకుంది. ఈ నెల 6న మృతురాలి శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా విషయం వెలుగుచూసింది. మృతురాలి కూతురు, ఆమె లవర్ కమ్ కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
News October 12, 2024
కేసీఆర్ ఇంట దసరా వేడుకలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సతీమణి, కుమారుడు, కోడలు, మనుమరాలుతో గులాబీ దళపతి వేడుకల్లో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన మనుమడు హిమాన్షు అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్లో పంచుకున్నారు. తొలిసారిగా కుటుంబం దగ్గర లేకుండా దసరా చేసుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత బయటికొచ్చిన తమ అధినేత ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
News October 12, 2024
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ
ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 40 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేశారు. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సులు బాదారు. మొత్తంగా 8 సిక్సులు, 9 ఫోర్లు కొట్టారు. మరోవైపు కెప్టెన్ సూర్య కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమ్ ఇండియా 12.1 ఓవర్లు ముగిసేసరికి 183 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మిగిలున్న నేపథ్యంలో స్కోర్ ఎంత చేయొచ్చో కామెంట్ చేయండి.