News June 20, 2024
రోజుకు 464 మంది చిన్నారులు చనిపోయారు!
వాయు కాలుష్యం వల్ల 2021లో మన దేశంలో రోజుకు సగటున 464 మంది ఐదేళ్లలోపు చిన్నారులు చనిపోయారు. అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (సోగా) 2024’లో ఈ విషయం వెల్లడైంది. 2021లో దాదాపు 1.7 లక్షల మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. వాయు కాలుష్యం వల్ల న్యుమోనియాతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి ఆస్తమా సోకుతున్నట్లు తేలింది.
Similar News
News September 11, 2024
టెట్ అభ్యర్థులకు మరో అవకాశం
TG: టెట్‌లో మార్కులు, హాల్ టికెట్, ఇతర వివరాల సవరణకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం ఇవ్వనుంది. డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని కోరుతున్నారు. ఇవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇస్తే సమస్యలొస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే రెండు రోజులపాటు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. దీనిపై నేడు లేదా రేపు ప్రకటన వచ్చే అవకాశముంది.
News September 11, 2024
అప్పుడు మోడల్.. ఇప్పుడు మేడమ్
యూపీలోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి మోడల్‌గా ఎదిగి ఆ తర్వాత సివిల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో డిగ్రీ చదివే సమయంలో ఆమె కొత్త ఫ్యాషన్స్, టూర్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. అది చూసిన కొన్ని సంస్థలు ఆమెకు మోడలింగ్ అవకాశమిచ్చాయి. ఆ తర్వాత మోడలింగ్‌ను పక్కనపెట్టి 2022లో సివిల్స్ ఫలితాల్లో 116వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఇన్‌స్టాలో ఆమెకు 271K ఫాలోవర్లు ఉన్నారు.
News September 11, 2024
ఇడ్లీ, దోసె పిండిని ఎన్ని రోజులు వాడొచ్చు?
ఇడ్లీ, దోసె పిండిని కొందరు వారంపాటు ఫ్రిజ్‌లో దాచుకుని వాడతారు. ఆ పిండిని రోజుల తరబడి ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు ఫ్రిజ్‌లో పెడితే అతిగా పులుస్తుంది. దానిని తింటే కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కువగా పులిసిన పిండిని బయటపడేయాలి. ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే వాడాలి. తాజాగా తింటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం.