News November 22, 2024

47/4.. పీకల్లోతు కష్టాల్లో భారత్

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రాహుల్(26) స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో పంత్(10), జురెల్(0) ఉన్నారు.

Similar News

News November 22, 2024

సబ్‌మెరైన్‌ను ఢీకొట్టిన చేపల వేట పడవ

image

గోవాలో ఓ సబ్‌మెరైన్‌ను చేపల వేట సాగించే పడవ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11 మందిని అధికారులు రక్షించారు. ఈ ఘటన గోవాకు 70 నాటికల్ మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. కాగా సబ్‌మెరైన్‌కు జరిగిన నష్టంపై నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై హై లెవెల్ విచారణ కొనసాగుతోంది. కాగా ఈ జలాంతర్గామి నేవీలో వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తుంది. శబ్దం లేకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత.

News November 22, 2024

జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ యావరేజ్ కలిగిన రెండో బౌలర్‌గా ఆయన నిలిచారు. 41 మ్యాచుల్లో 177 వికెట్లు తీసి 20.17 యావరేజ్ కలిగి ఉన్నారు. అగ్ర స్థానంలో సిడ్నీ బార్న్స్ (16.43) ఉన్నారు. వీరిద్దరి తర్వాత అలెన్ డేవిడ్‌సన్ (20.53), మాల్కమ్ మార్షల్ (20.94), జోయల్ గార్నర్ (20.97) కొనసాగుతున్నారు.

News November 22, 2024

ఆ విష‌యంలో కూట‌మి పార్టీల నేతలు గ‌ప్‌చుప్‌

image

సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల లంచాల‌ వ్య‌వ‌హారంలో అదానీపై అమెరికా దర్యాప్తు సంస్థ‌ల ఆరోప‌ణ‌ల‌పై APలో టీడీపీ, జ‌న‌సేన‌, BJP కూట‌మి మౌనంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే అదానీ నుంచి జ‌గ‌న్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న‌ట్టు కూట‌మి అనుకూల వేదిక‌లు ఈ వ్యవహారంపై పెద్దఎత్తున ప్రచారం చేశాయి. మోదీ-అదానీల మధ్య ఉన్న బంధం వ‌ల్లే కూటమిలోని పార్టీల నేత‌లు ఈ వ్య‌వ‌హారంలో నేరుగా స్పందించ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.