News November 22, 2024
47/4.. పీకల్లోతు కష్టాల్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రాహుల్(26) స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో పంత్(10), జురెల్(0) ఉన్నారు.
Similar News
News December 3, 2024
రాజ్యసభ ఉప ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరేనా?
AP: రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. TDP తరఫున బీద మస్తాన్ రావు, సానా సతీశ్, BJP నుంచి ఆర్.కృష్ణయ్య బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేన ఒక సీటు ఆశించినా ఇప్పటికైతే ఆ ఛాన్స్ లేదని టాక్. నాగబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు Dy.CM పవన్ హస్తినలో చక్రం తిప్పినా ఫలితం లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది.
News December 3, 2024
సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే?
ఒకప్పుడు థియేటర్‌లో ఫ్యాన్ సౌండ్ మోత భరిస్తూ సినిమా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి సెంట్రల్ ఏసీలు, ప్రీమియం సీటింగ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో టికెట్ ధరలూ పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా మూవీలకు అసలు బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా టికెట్ రేట్ల పెంపునకు ఓ కారణం. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు, భారీ సెట్లు, లొకేషన్లు, VFXల కారణంగా ధరలు అధికంగా పెరుగుతున్నాయి.
News December 3, 2024
త్వరలో పుతిన్ భారత్ పర్యటన
వచ్చే ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష ఫారిన్ పాలసీ అడ్వైజర్ యూరీ యుషాకోవ్ తెలిపారు. త్వరలోనే పుతిన్ పర్యటన తేదీలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైనప్పుడు పుతిన్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు. దీంతో మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇక్కడికి వస్తున్నారు.