News February 15, 2025

22 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 48ఏళ్ల నటుడు

image

బాలీవుడ్ నటుడు, యూట్యూబర్ సాహిల్ ఖాన్ 48 ఏళ్ల వయసులో వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలైన 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాను వివాహమాడారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో వీరిద్దరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాహిల్ గతంలో నార్వేజియన్ నటి నెగర్ ఖాన్‌ను వివాహం చేసుకోగా రెండేళ్లకే విడిపోయారు.

Similar News

News April 19, 2026

‘శారీరక అవసరాలు ఉంటే చెప్పు’.. TCS కేసులో సంచలన విషయాలు

image

TCS మతమార్పిడి కేసులో ఓ బాధితురాలు ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2025లో కంపెనీలో చేరిన కొత్తలో వేరే విభాగానికి చెందిన రెజా, ఆన్‌ జాబ్ ట్రైనింగ్‌లో ఆసిఫ్ అన్సారీ వేధించారని పేర్కొంది. ఉద్యోగ రీత్యా భర్తకు దూరంగా ఉంటున్న తనతో అసభ్యంగా మాట్లాడేవారని పేర్కొంది. ‘ఏమైనా శారీరక అవసరాలు ఉంటే చెప్పు. బుర్ఖా లేకనే మీ మతంలో ఆడవాళ్లు అత్యాచారానికి గురవుతున్నారు’ అని అన్సారీ వేధించాడని తెలిపింది.

News April 19, 2026

అల్లికలతో వ్యసనాలకు చెక్!

image

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

పాక్‌లో భారీ భద్రత.. రెండో విడత చర్చల కోసమేనా?

image

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా క్లారిటీ రాకపోయినా పాకిస్థాన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇస్లామాబాద్, రావల్పిండీ నగరాల్లో కఠిన ఆంక్షలు విధించింది. రావల్పిండీలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పార్కులు, బ్యాంకులు, షాప్స్, రెస్టారెంట్లను మూయించింది. 600 చెక్ పాయింట్లలో 10వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది.