News February 7, 2025
అమెరికాలో 487 మంది భారత అక్రమ వలసదారులు: MEA

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.
Similar News
News November 2, 2025
దేశంలోనే తొలి మహిళా ఈటీవో

రోమీతా బుందేలాకు చిన్నప్పటి నుంచే నీళ్లంటే ఇష్టం. నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. చివరికి ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సు కనిపించింది. షిప్లో పవర్ మేనేజ్మెంట్ చెయ్యడం ప్రధాన విధి. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఆ కోర్సు పూర్తి చేశారు. నీళ్ల మధ్యలో నెలల తరబడి సముద్రంలో ఉండాల్సి వచ్చేది. విపరీతమైన ఒత్తిడి. వాటిని దాటి ఎన్నో పదోన్నతులు పొంది ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్నారు.
News November 2, 2025
రేపు సీఏ ఫలితాలు

దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ICAI రేపు విడుదల చేయనుంది. సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ 2PMకు, ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్స్ ఫలితాలు 5PMకు రిలీజవుతాయి. https://www.icai.org/లో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్కోర్ను తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 3-22 మధ్య ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
News November 2, 2025
నగలు సర్దేయండిలా..

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్నిరకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. దేనికవే విడివిడిగా పెట్టాలి. ఎయిర్టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడటం ఉత్తమం.


