News July 12, 2024
సహజీవనం చేసే వ్యక్తిపై 498A వర్తించదు: హైకోర్టు

చట్టబద్ధంగా వివాహం కానప్పుడు భాగస్వామిపై 498ఏ కేసు పెట్టడం కుదరదని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓ వ్యక్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. సహజీవనంలోని భాగస్వామికి, చట్టబద్ధంగా జరిగిన పెళ్లిలో భర్త అన్న పదానికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషనర్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
Similar News
News February 18, 2025
ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి పెంపు

TG: ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితిని మరో నెల రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10తో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియగా, మార్చి 10 వరకు పొడిగించింది. దీంతో వర్గీకరణపై ప్రభుత్వం మరేమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
News February 18, 2025
పుష్ప-2 కలెక్షన్లు ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. గతేడాది DEC 5న రిలీజై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీని సుకుమార్ తెరకెక్కించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘పుష్ప-2’ స్ట్రీమింగ్ అవుతోంది.
News February 18, 2025
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా ఉంచుతాం: రేవంత్

TG: దేశంలోనే సైబర్ సేఫ్టీలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న షీల్డ్-2025 సదస్సులో ఆయన మాట్లాడారు. ‘దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ.22,812 కోట్లు దోచుకున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థ, పౌరులకు పెద్ద ముప్పు. సైబర్ నేరాల నుంచి రక్షించే 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి’ అని CM కోరారు.