News March 28, 2024

పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

image

2013-2023 మధ్య ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 4.62 లక్షల మోసాలు జరిగినట్లు RBI వెల్లడించింది. పదేళ్లలో ₹5.3 లక్షల కోట్ల స్కామ్‌లు జరిగాయని RTI దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ‘రుణాలు, కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలోనే ఎక్కువ మోసాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధిక స్కామ్‌లు బయటపడగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, తమిళనాడు, UP, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి’ అని పేర్కొంది.

Similar News

News March 27, 2026

జీడిమామిడి పిక్కలకు అధిక ధర రావాలంటే..

image

చాలా మంది రైతులు జీడిమామిడి కాయలను పూర్తిగా పండకుండానే చెట్ల నుంచి తీసేస్తున్నారు. దీని వల్ల పిక్కల లోపల పప్పు పూర్తిగా తయారవ్వడంలేదు. ఫలితంగా మార్కెట్‌లో ఆశించిన ధర దక్కడం లేదు. అందుకే తోటల్లో పండు, పిక్కతో సహా కింద పడిన కాయలను మాత్రమే ఏరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల నుంచి పిక్కలను వేరు చేసి.. వాటిని 3 రోజుల పాటు ఎండలో ఆరబెడితే గింజలు మంచి బరువు ఉండి, అధిక ధర లభిస్తుంది.

News March 27, 2026

వెండి తెర ‘శ్రీరాములు’

image

ఆదర్శ పురుషుడైన శ్రీరాముడి పాత్రను వెండి తెరపై పోషించి పలువురు మెప్పించారు. 1932లో ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో తొలిసారి యడవల్లి సూర్యనారాయణ రాముడిగా కనిపించారు. అనేక చిత్రాల్లో NTR రఘురాముడిగా జీవించారు. వీరే కాకుండా CSR ఆంజనేయులు, ANR, హరనాథ్, శోభన్‌బాబు, కాంతారావు, జూ.NTR, సుమన్, శ్రీకాంత్, బాలకృష్ణ, ప్రభాస్ రామయ్య పాత్రలో మెరిశారు. మహేశ్ బాబు, రణ్‌బీర్ కూడా రాముడిగా నటిస్తున్నారు.

News March 27, 2026

భద్రాచలం రాముని విగ్రహం – ఒక అరుదైన రూపం

image

సాధారణంగా ఏ రామాలయంలోనైనా శ్రీరాముడు విల్లు పట్టుకొని కనిపిస్తారు. కానీ భద్రాచలంలో రామచంద్రమూర్తి చతుర్భుజాలతో దర్శనమిస్తారు. పై రెండు చేతుల్లో శంఖు, చక్రాలు.. కింద రెండు చేతుల్లో ధనుర్భాణాలు ధరించి ఉంటారు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది వైకుంఠ రాముని రూపం. సీతమ్మ వారు స్వామివారి ఎడమ తొడపై కూర్చొని ఉంటారు. అందుకే ఈ విగ్రహాన్ని “ఆలింగన మూర్తి”గా కూడా భక్తులు భావిస్తారు.