News March 24, 2024

5 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

Similar News

News October 2, 2024

గాయమంటూ కథనాలు: వార్తాసంస్థలపై షమీ ఆగ్రహం

image

తనకు గాయం తిరగబెట్టిందంటూ కథనాలు ప్రచురించిన వార్తాసంస్థలపై టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను కోలుకుని తిరిగి ఆడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నేను ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడట్లేదని బీసీసీఐ గానీ నేనుగానీ చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి మీకీ వార్తలు? నా తరఫున ప్రకటన లేకుండా ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరుతున్నా’ అని విజ్ఞప్తి చేశారు.

News October 2, 2024

సురేఖ కామెంట్స్‌పై రేవంత్ ఎలా స్పందిస్తారో?

image

TG: చైతూ-సామ్ విడాకులు, KTR, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ <<14254371>>కామెంట్స్<<>> రచ్చకు దారితీశాయి. వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని సురేఖకు KTR లీగల్ నోటీసులు పంపారు. అయితే మంత్రి కామెంట్స్‌పై CM రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. సురేఖను మందలించి, ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

News October 2, 2024

2 లక్షల మార్కుకు చేరువగా మహీంద్రా థార్

image

నాలుగేళ్ల క్రితం లాంచ్ అయిన మహీంద్రా థార్ వాహన ప్రియుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్లలో 1.90 లక్షల వాహనాలను విక్రయించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ముగిసేలోపు 2 లక్షల మార్కును దాటేస్తామని ధీమా వ్యక్తం చేసింది. థార్‌ త్రీ-డోర్ వాహనం కాగా.. ఐదు తలుపులతో కూడిన థార్ రాక్స్‌ను మహీంద్రా ఈ ఏడాది తీసుకొచ్చింది. దానికీ అమ్మకాలు భారీగానే ఉండటం విశేషం.