News March 24, 2024

5 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

Similar News

News December 7, 2025

ఉప్పల్‌లో మెస్సీ మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

image

TG: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ-CM రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ <<18413680>>మ్యాచ్‌<<>> ఆడనున్న విషయం తెలిసిందే. దీనిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు రానున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మ్యాచ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్ణీత సమయానికి ముందే ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.

News December 7, 2025

₹500 కోట్లు ఇచ్చినోళ్లు సీఎం అవుతారు: సిద్ధూ భార్య

image

₹500 కోట్లు ఇచ్చిన వాళ్లు CM అవుతారని నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూను CM అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చెప్పారు. ‘పంజాబ్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. అవకాశం ఇస్తే పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తాం. CM కుర్చీ కోసం ఇచ్చేందుకు మా దగ్గర ₹500 కోట్లు లేవు’ అని చెప్పారు. అయితే తమను ఎవరూ డబ్బు డిమాండ్ చేయలేదన్నారు.

News December 7, 2025

TCILలో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<>TCIL<<>>)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫామ్‌, డాక్యుమెంట్స్‌ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tcil.net.in/