News March 13, 2025
జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
ఆ సినిమాలో సమంత గెస్ట్ రోల్?

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత గెస్ట్ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. క్లైమాక్స్‌లో ఆమె పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సమంత, అనుపమ కలిసి ‘అ ఆ’లో నటించారు. ‘పరదా’ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ సిరీస్‌లో నటిస్తున్నారు.
News March 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 13, 2025
ఇంటర్ పేపర్లలో తప్పులు.. విద్యార్థుల ఆందోళన

TG: ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సెకండియర్ బోటనీలో 2, గణితంలో ఒక తప్పు, మంగళవారం ఫస్టియర్ పేపర్లలో 3 సబ్జెక్టుల్లో 6 తప్పులు దొర్లాయి. సోమవారం సెకండియర్ ఇంగ్లిష్ పేపర్ అస్పష్టంగా ముద్రించడంతో ఏడో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తామని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు.