News March 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News February 17, 2026
AI+డేటా.. రెండేళ్లలో $200Bn పెట్టుబడులు: అశ్వినీ వైష్ణవ్

భారత్‌లో AI, డేటా రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ 2 రంగాలు రెండేళ్లలో $200 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని అంచనా వేశారు. క్లౌడ్ సేవలను అందించే కంపెనీలకు 21 ఏళ్ల పన్ను మినహాయింపు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఢిల్లీలో నిర్వహిస్తోన్న AI సమ్మిట్ కంపెనీల ప్రతిభను ప్రపంచానికి చూపడానికి ఓ గొప్ప అవకాశమన్నారు. దేశం ITలోనూ సత్తా చాటుతోందని పేర్కొన్నారు.
News February 17, 2026
ఇది కదా సక్సెస్ అంటే..

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య పాత ఫొటో ఒకటి SMలో వైరలవుతోంది. 2014లో తన ఫ్రెండ్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి హాజరైనప్పటి ఫొటో అది. కట్ చేస్తే.. కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని 30Y వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. సక్సెస్ అంటే ఇదేనని, ఎంత ఎత్తుకు ఎదిగినా అతను ఇప్పటికీ తన స్నేహితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
News February 17, 2026
భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్: మోదీ

కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన టాటా-ఎయిర్‌బస్ H125 హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాంట్‌ను మోదీ, మాక్రాన్ ప్రారంభించారు. 2026ను భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్‌గా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య స్టార్టప్‌లు, AI, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంచుతామన్నారు. ఫ్రాన్స్‌లో వివేకానంద కల్చరల్ సెంటర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్ అని మోదీ పేర్కొన్నారు.


