News June 15, 2024
ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్
ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చేసిన చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని సీఎం అన్నారు. కాగా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ 30 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
Similar News
News September 14, 2024
నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు
TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.
News September 14, 2024
మా నాన్న పులిని చంపి, ఆ రక్తం నా ముఖంపై పూశారు: యోగ్‌రాజ్
తన వద్ద కోచింగ్‌లో చేరాలంటే చావుపై భయం వదిలేయాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘మా నాన్న నన్ను చావు భయం లేకుండా పెంచారు. పులి వేటకు నన్ను తీసుకెళ్లారు. పులిని చంపి నన్ను దానిపై కూర్చోబెట్టారు. దాని రక్తం నా ముఖానికి పూశారు. పులికూన గడ్డి తినదని ఆయన అన్న మాట నేనెప్పటికీ మర్చిపోలేను. అందుకే నా కొడుకును కూడా భయంలేనివాడిలా పెంచాను’ అని పేర్కొన్నారు.
News September 14, 2024
జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ ఛైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.