News April 2, 2024
500 మంది ఉద్యోగులకు బైజూస్ ఉద్వాసన

ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్న ఎడ్‌టెక్ సంస్థ బైజూస్.. తాజాగా 500 మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగం కోల్పోయినవారిలో సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. పని తీరు సరిగా లేని వారిని తొలగిస్తున్నట్లు ఫోన్‌లోనే తెలియజేసినట్లు నేషనల్ మీడియా తెలిపింది. నోటీస్ పీరియడ్ ఇవ్వలేదని, పనితీరు మెరుగుపరుచుకునే అవకాశమూ కల్పించలేదని ఉద్యోగులు వాపోతున్నారు.
Similar News
News April 20, 2025
వరల్డ్ కప్ కోసం భారత్ వెళ్లం: పాక్

భారత్‌లో జరగనున్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తమ టీమ్ పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లోనే తాము ఆడతామని PCB ఛైర్మన్ నఖ్వీ తెలిపారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే మా దేశానికి రాకుండా న్యూట్రల్ వేదికల్లో ఆడిందో, మేము కూడా అలాగే ఆడతాం. WC ఆతిథ్య దేశమైన భారతే ఆ వేదికలను ఎంపిక చేయాలి’ అని నఖ్వీ అన్నారు.
News April 20, 2025
ఈ నెల 23 నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్‌లో భారత్, అమెరికా వాణిజ్య చర్చలు జరపనున్నాయి. టారిఫ్స్ నుంచి కస్టమ్స్ వరకు పలు అంశాలపై ఈ చర్చల్లో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత బృందానికి వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ నేతృత్వం వహించనున్నారు.
News April 20, 2025
‘డయాఫ్రం వాల్’ టెక్నాలజీపై మహారాష్ట్ర అధికారుల ఆరా

AP: పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. స్పిల్ వే, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రం వాల్, జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వాడుతున్న టెక్నాలజీ, ఉపయోగించే యంత్రాల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పట్టిసీమ ప్రాజెక్టునూ పరిశీలించారు.