News November 3, 2024
NICLలో 500 ఉద్యోగాలు.. అప్లై చేశారా?
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైనా డిగ్రీ చదివి, 21-30 ఏళ్ల లోపు వారు అర్హులు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. SC, ST, PWD అభ్యర్థులు రూ.100, ఇతరులు రూ.850 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎంపికైన వారు రూ.22,405- రూ.62,265 వరకు జీతం అందుకోవచ్చు. అప్లై లింక్: https://ibpsonline.ibps.in/niclaoct24/
Similar News
News December 9, 2024
పుష్ప-3 వచ్చేది ఎప్పుడంటే..
పుష్ప-2తో అల్లు అర్జున్, సుకుమార్ ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. పుష్ప-3 ఉంటుందని ఆ సినిమా చివర్లో క్లారిటీ ఇచ్చేశారు. కానీ అదెప్పుడు అన్నదే బన్నీ ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ టాక్ ప్రకారం.. త్రివిక్రమ్‌తో కలిసి ఓ ప్రత్యేకమైన కథతో బన్నీ సినిమా చేయనున్నారు. అది పూర్తయ్యాకే పుష్ప-3 గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాల కోసం బన్నీ ఐదేళ్లు కేటాయించడం గమనార్హం.
News December 9, 2024
NIA మోస్ట్ వాంటెడ్.. 2,500 కి.మీ వెంటాడి పట్టుకున్నారు
NIAకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న కమ్రాన్ హైదర్‌ను ఢిల్లీ పోలీసులు 2,500 KM వెంటాడి పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా, ఫేక్ కాల్ సెంటర్‌లతో దోపిడీ కేసులో ఇతను కీలక నిందితుడు. ఓ కన్సల్టెన్సీని నడుపుతూ థాయిలాండ్, లావోస్‌కు భారతీయుల అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా రాష్ట్రాలు మారుతూ తప్పించుకు తిరుగుతున్న కమ్రాన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం HYDలో అరెస్టు చేశారు.
News December 9, 2024
మీకో చట్టం.. ప్రతిపక్షానికి మరో చట్టమా?: అంబటి
AP: రాష్ట్రంలో అధికార పక్షానికి ఓ చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టం అమలవుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని YCP నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మాజీ CM జగన్, ఆయన సతీమణి, మాజీ మంత్రులపై టీడీపీ వాళ్లు పోస్టులు పెడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు తమ ఫిర్యాదులకు స్పందించడం లేదని, ప్రజలు గమనించాలని కోరారు.