News November 15, 2024

గుజరాత్‌లో 500 కేజీల డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

image

గుజ‌రాత్‌ పోర్‌బంద‌ర్‌లో స‌ముద్ర మార్గంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 500 KGల డ్ర‌గ్స్‌ను అధికారులు ప‌ట్టుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డ్ర‌గ్స్ రాకెట్ గుట్టుర‌ట్టైంది. ఇరాన్ దేశానికి చెందిన బోటులో డ్ర‌గ్స్ తెచ్చిన‌ట్టు అధికారులు గుర్తించారు. సరిహద్దు జలాల్లో నేవీ సాయంతో న‌డిసంద్రంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.

Similar News

News December 2, 2024

మోస్ట్ డిజాస్టర్ మూవీగా ‘కంగువ’!

image

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘కంగువ’ థియేట్రికల్ రన్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.130 కోట్ల నష్టంతో ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచినట్లు వెల్లడించాయి. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. ఈ మూవీ రూ.120 కోట్లు నష్టపోయింది. కాగా మరికొన్ని రోజుల్లో ‘కంగువ’ OTTలోకి రానుంది.

News December 2, 2024

ఉద్యోగుల అంత్యక్రియల ఛార్జీలు పెంపు

image

TG: ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఖర్చును రూ.20 వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

News December 2, 2024

విండ్ ఫాల్ టాక్స్ రద్దు చేసిన కేంద్రం

image

ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రిలయన్స్, ONGC వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. దేశీయ సంస్థలు ముడి చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఈ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు ఆ సంస్థలు ఆయా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తుంటాయి.