News September 7, 2024

హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్!

image

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జుడీషియరీ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం.. వీటిలో 30 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 62వేలు. 20 నుంచి 30 ఏళ్లుగా హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.45 లక్షలు. 3 కేసులు 1952 నుంచి, 4 కేసులు 1954 నుంచి, 9 కేసులు 1955 నుంచి పరిష్కారం కాలేదు. మొత్తంగా 42.64 లక్షల సివిల్ కేసులు, 15.94 లక్షల క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

Similar News

News October 13, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలిరోజు 11 నామినేషన్లు

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలి రోజు నామినేషన్లు ముగిశాయి. మొత్తం పది మంది 11 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్రులు సిలివేరు శ్రీకాంత్‌, పెసరికాయల పరీక్షిత్ రెడ్డి, చంద్రశేఖర్, పూసా శ్రీనివాస్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీంఖాన్, ఆరావల్లి శ్రీనివాసరావు, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్, సపావత్ సుమన్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది.

News October 13, 2025

వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

News October 13, 2025

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.