News September 7, 2024
హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్!
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జుడీషియరీ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం.. వీటిలో 30 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 62వేలు. 20 నుంచి 30 ఏళ్లుగా హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.45 లక్షలు. 3 కేసులు 1952 నుంచి, 4 కేసులు 1954 నుంచి, 9 కేసులు 1955 నుంచి పరిష్కారం కాలేదు. మొత్తంగా 42.64 లక్షల సివిల్ కేసులు, 15.94 లక్షల క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Similar News
News October 14, 2024
భూకేటాయింపులపై ఖర్గే కీలక నిర్ణయం!
ముడా స్కాంలో కర్ణాటక CM సిద్ధ రామయ్యపై ED కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు KT ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను తిరిగివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
News October 13, 2024
కన్నడ బిగ్‌బాస్‌కు పోలీసుల షాక్!
కన్నడ బిగ్‌బాస్‌లో స్వర్గం-నరకం అనే కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం నరకంలో ఉన్న కంటెస్టెంట్లకు ఆహారంగా గంజి మాత్రమే ఇచ్చేవారు. బాత్రూమ్‌కి వెళ్లాలన్నా ‘స్వర్గం’ కంటెస్టెంట్ల అనుమతి తీసుకోవాలి. దీంతో షోలోని మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి పోలీసులకు లేఖ రాశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి నిర్వాహకులకు నోటీసులిచ్చారు.
News October 13, 2024
నితీశ్ కుమార్ విజయం వెనుక తండ్రి త్యాగం
తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ నేడు భారత క్రికెటరయ్యారు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగమే తన ఎదుగుదలకు పెట్టుబడైంది. ‘నేను జాబ్ చేసే సంస్థ రాజస్థాన్‌కు మారింది. దాంతో నితీశ్ క్రికెట్‌కి ఇబ్బంది అని ఆ జాబ్ మానేశాను. ఆర్థికంగా బాగా కష్టపడ్డాం. అందరూ ఎన్నో మాటలు అన్నారు. నితీశ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తే చాలనుకున్నాను. కానీ ఏకంగా భారత్‌కు ఆడుతున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో మురిసిపోయారు ఆ తండ్రి.