News September 25, 2024

30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు

image

బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్‌లో టీమ్ లీడర్‌గా ఉన్న రంజన్‌తో రిలేషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.

Similar News

News January 31, 2026

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

image

TG: హైదరాబాద్‌లోని కోఠి SBI కార్యాలయం వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ATMలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్దనున్న రూ.6 లక్షలు దోపిడీ చేశారు. కాల్పుల్లో రిషద్ కాలికి గాయం కాగా.. ఆస్పత్రికి తరలించారు. పోలీసులు CCTV దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

News January 31, 2026

భార్యభర్తల మధ్య తరచూ గొడవలవుతున్నాయా?

image

కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునే సమయం లేనప్పుడు బంధం దూరం అవుతుంటుంది. దీని వల్ల మనస్పర్థలు పెరిగి తరచూ గొడవలు వస్తుంటాయి. అందుకే ఇద్దరు కూడా అన్ని విషయాలలో ఒకరికొకరు షేర్‌ చేసుకోవడం ఎంతో మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇద్దరు కూడా కుటుంబం గురించి మాట్లాడుకోవడం, ఆర్థికపరమైన విషయాలు చర్చించుకోవాలంటున్నారు. కమ్యునికేషన్ బావుంటే ఇబ్బందులుండవని సూచిస్తున్నారు.

News January 31, 2026

నవ గ్రహాలు – వాటి వాహనాలు

image

ఆదిత్యుడు – సప్త అశ్వాల రథం
చంద్రుడు – పది తెలుపు గుర్రాల రథం
అంగారకుడు – మేక
బుధుడు – సింహం
గురు – గజరాజు
శుక్రుడు – ఒంటె/గుర్రం/మొసలి
శని – కాకి
రాహువు – సింహం
కేతువు – గద్ద/రాబందు/డేగ