News September 25, 2024
30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు
బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్‌లో టీమ్ లీడర్‌గా ఉన్న రంజన్‌తో రిలేషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.
Similar News
News October 15, 2024
బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కసరత్తు
AP: బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. SC, ST అట్రాసిటీ చట్టం మాదిరిగానే BCల కోసం దీన్ని అందుబాటులోకి రానుంది. 8 మంది మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, అనగాని, పార్థసారథి, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సచివాలయంలో విధివిధానాల రూపకల్పనపై చర్చించారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
News October 15, 2024
రేపు క్యాబినెట్ భేటీ.. కీలక పథకానికి ఆమోదం?
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగంపై 5-6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు వస్తాయని తెలుస్తోంది.
News October 15, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?
దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.