News June 5, 2024

5జీ స్పెక్ట్రమ్ వేలం మళ్లీ వాయిదా

image

టెలికాం రంగం ప్రతిష్ఠాత్మకంగా భావించే 5జీ స్పెక్ట్రమ్ వేలం మరోసారి వాయిదా పడింది. జూన్ 25న ఆక్షన్ నిర్వహించనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ వెల్లడించింది. కాగా మే 20న జరగాల్సిన ఆక్షన్ ఈనెల 6కు తొలుత వాయిదా పడగా తాజాగా మరోసారి డేట్ మారింది. జూన్ 13, 14 తేదీల్లో మాక్ ఆక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా రూ.96వేలకోట్ల బేస్ ప్రైస్‌తో పలు 5జీ బ్యాండ్‌లకు వేలం జరగనుంది.

Similar News

News October 7, 2024

22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్

image

AP: విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5వేల డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

News October 7, 2024

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్

image

టీ20ల్లో అత్యధిక మ్యాచులను సిక్సర్లతో ముగించిన భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్య నిలిచారు. బంగ్లాతో మ్యాచులో కోహ్లీ(4 మ్యాచులు) రికార్డును అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, పంత్ మూడేసి మ్యాచులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ జరిగిన T20 మ్యాచులో హార్దిక్ 39 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.

News October 7, 2024

బతుకమ్మకు అమెరికాలో అరుదైన గౌరవం

image

తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు ఈ పండుగను అధికారికంగా గుర్తించాయి. అంతే కాకుండా ఈ వారాన్ని హెరిటేజ్ వీక్‌గా ప్రకటిస్తూ ఆ రాష్ట్రాల గవర్నర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై అమెరికాలోని తెలంగాణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.