News November 28, 2024
ప్రభుత్వం అలా.. ప్రతిపక్షం ఇలా!
TG: ఏడాదిలో రైతుల కోసం రూ.54,280కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి గుర్తుగా మహబూబ్‌నగర్‌లో మూడో రోజులపాటు ‘రైతు పండుగ’ నిర్వహిస్తోంది. అయితే రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బోనస్ వంటివి కలిపి ఇంకా రూ.40,800 కోట్లు చెల్లించాల్సి ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏం చేశారని ‘రైతు పండుగ’ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై మీ కామెంట్.
Similar News
News December 11, 2024
భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 298 పరుగులు చేసింది. ఆ జట్టులో అన్నాబెల్(110) సెంచరీతో చెలరేగారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీశారు. ఛేదనలో స్మృతి మంధాన(105) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. AUS బౌలర్ గార్డ్‌నర్ 5 వికెట్లు తీసి పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
News December 11, 2024
వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్
AP: వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ సమాచారమంతా ఒకే వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీలో ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఏఈ ప్లాట్‌ఫాం ఒక్కటే పౌరసేవలు అందిస్తోందని పేర్కొన్నారు.
News December 11, 2024
మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్
TG: జల్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంచు విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్‌పై దాడి కేసులో ఆయనను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి జరిగిందని మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరో నిందితుడు వినయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.