News December 9, 2024

శ్రీవారి దర్శనానికి 6 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంటులో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,107 మంది దర్శించుకున్నారు. 22,721 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు లభించింది.

Similar News

News January 20, 2025

కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే: భట్టి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12వేలు జమచేస్తామని పేర్కొన్నారు.

News January 20, 2025

ఈ నెల 28 నుంచి నాగోబా జాతర

image

TG: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఆదివాసుల పండగ నాగోబా జాతర ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే ఈ జాతరకు వేదపండితులు, దేవదాయశాఖ అధికారులు మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వానం పలికారు. ఈ జాతరకు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

News January 20, 2025

పేరుకే ‘పెద్దన్న’.. జీతం వారికన్నా తక్కువే

image

పెద్దన్నగా పేరొందిన అమెరికా అధ్యక్షుడి జీతం పలు దేశాధినేతల కంటే తక్కువే. యూఎస్ అధ్యక్షుడి గౌరవ వేతనం ఏడాదికి రూ.4 లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3.46 కోట్లు. సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి సుమారు రూ.13.85 కోట్లు, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలరీ రూ.6 కోట్లు, స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి రూ.4.9 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా వారికి అదనపు భత్యాలు అందుతాయి.