News March 2, 2025

6 MLC స్థానాలు.. రేపే కౌంటింగ్

image

తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు రేపు కౌంటింగ్ జరగనుంది. ఉ.8 నుంచి ప్రక్రియ మొదలుకానుంది. లెక్కింపు సిబ్బందికి అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉ.గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ, TGలో MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి పోలింగ్ జరిగింది.

Similar News

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

News December 4, 2025

NGKL: జిల్లాలో తగ్గిన చలి తీవ్రత..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత తగ్గింది. గడిచిన 24 గంటలో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చారకొండ మండలం సిర్సనగండ్ల 20.1, పదర మండలం వంకేశ్వర్ 20.7, వెల్దండ మండలం బొల్లంపల్లి 20.9, నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరులో 21.1, తెలకపల్లిలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.