News March 2, 2025
6 MLC స్థానాలు.. రేపే కౌంటింగ్

తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు రేపు కౌంటింగ్ జరగనుంది. ఉ.8 నుంచి ప్రక్రియ మొదలుకానుంది. లెక్కింపు సిబ్బందికి అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉ.గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ, TGలో MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి పోలింగ్ జరిగింది.
Similar News
News March 23, 2025
టాస్ గెలిచిన CSK

IPL-2025: చెన్నై వేదికగా ఇవాళ MI, CSK జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
News March 23, 2025
రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

TG: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ APR నుంచి 6KGల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్‌నగర్‌లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు.
News March 23, 2025
విశాఖ మేయర్ పీఠంపై రాజకీయం

AP: విశాఖ మేయర్‌పై కూటమి నేతలు <<15849529>>అవిశ్వాస తీర్మాన<<>> నోటీస్ ఇవ్వడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ మండలి ప్రతిపక్ష నేత బొత్స, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాసం నెగ్గకుండా ఉండేందుకు సమాలోచనలు చేశారు. అవసరమైతే క్యాంప్ రన్ చేయాలని నిర్ణయించారు. GVMCలో 98 స్థానాలుండగా, వైసీపీ కార్పొరేటర్ల చేరికలతో కూటమి బలం 70(+11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు)కి చేరింది.