News September 21, 2024

భారత్ విజయానికి మరో 6 వికెట్లు

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం లాంఛనంగా కనిపిస్తోంది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 357 పరుగులు కావాలి. భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా ఒక వికెట్ తీశారు. అంతకుముందు పంత్, గిల్ సెంచరీలతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 287/4 పరుగులకు డిక్లేర్ చేసింది.

Similar News

News September 21, 2024

టీటీడీకి పాల ఉత్పత్తులు ఇచ్చేందుకు సిద్ధం: విజయ డెయిరీ

image

TG: తిరుమల లడ్డూ కల్తీ వార్తల నేపథ్యంలో టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమని తెలంగాణ విజయ డెయిరీ పేర్కొంది. దేవస్థానానికి సమర్పించే నైవేద్యాలకు నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేస్తామని తెలిపింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ ద్వారా తెలియజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ వెల్లడించారు.

News September 21, 2024

చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్

image

బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు(15,205) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. భారత్‌తో టెస్టులో రెండో ఇన్నింగ్సులో 13 పరుగులతో తమీమ్ ఇక్బాల్(15,192)ను అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో షకీబ్(14,696), మహ్మదుల్లా(10,694), లిటన్ దాస్(7,127) ఉన్నారు.

News September 21, 2024

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్

image

AP: గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మన రాష్ట్రంతో పాటు దేశానికీ చెడ్డ పేరు వచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదని చెప్పారు. YCP పాలనలో పారిశ్రామిక రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.