News September 21, 2024
భారత్ విజయానికి మరో 6 వికెట్లు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం లాంఛనంగా కనిపిస్తోంది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 357 పరుగులు కావాలి. భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా ఒక వికెట్ తీశారు. అంతకుముందు పంత్, గిల్ సెంచరీలతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 287/4 పరుగులకు డిక్లేర్ చేసింది.
Similar News
News October 9, 2024
PHOTO: ‘సార్ పుణ్యమా అంటూ DSCలో జాబ్ వచ్చింది’ అని దండం
TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ‘సార్ పుణ్యమా అంటూ డీఎస్సీలో జాబ్ వచ్చింది’ అంటూ ఓ వ్యక్తి ఎల్బీ స్టేడియంలోని సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
News October 9, 2024
కేంద్రం బ్యాన్ చేసిన యాప్.. ఎన్నికల సంఘం వాడుతోంది!
కేంద్రం 2020లో 59 చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్‌స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్‌ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.
News October 9, 2024
GREAT: 18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!
నేపాల్‌కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్‌లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించేకొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని పర్వతారోహకులు గొప్పగా చెబుతారు.