News December 30, 2024
60 మంది బెస్ట్ యాక్టర్స్.. ఇండియా నుంచి ఒక్కరే

ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు 60 మంది బెస్ట్ యాక్టర్ల జాబితాను యూకేకు చెందిన ‘ది ఇండిపెండెంట్’ పత్రిక విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ఇర్ఫాన్ ఖాన్ ఒక్కరినే చేర్చింది. ఆయనకు 41వ ర్యాంక్ ఇచ్చింది. 1988లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ 100కు పైగా చిత్రాల్లో నటించారు. పాన్ సింగ్ థోమర్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, అనేక చిత్రాలకు ఫిల్మ్ఫేర్ పురస్కారాలను పొందారు. ఈయన 2020లో చనిపోయారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


