News July 11, 2024
6,000+ రన్స్, 200 వికెట్లు.. స్టోక్స్ రికార్డు

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సాధించారు. 6,000+ రన్స్, 200 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా నిలిచారు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. గ్యారీ సోబర్స్(8,032 పరుగులు& 235 వికెట్లు), జాక్వెస్ కల్లిస్(13,289& 292), స్టోక్స్(6,320& 200*) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.
Similar News
News February 18, 2025
ఓంకారేశ్వర చరిత్ర మీకు తెలుసా!

మధ్యప్రదేశ్‌లో ఉండే ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా నదిఒడ్డున ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో <<15487669>>నాల్గవది<<>>. స్థలపురాణం ప్రకారం.. పూర్వం వింధ్య పర్వతుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు పర్వతరాజు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉండేలా వరం కోరుతారు. దీంతో పరమేశ్వరుడు పార్థివాకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అనే రెండు రూపాల్లో ఇక్కడ వెలిశారు. ఈ రెండు లింగరూపాలను ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు.
News February 18, 2025
TTD అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల డొనేషన్

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసీద్ యూనో ఫ్యామిలీ ట్రస్ట్‌కు చెందిన తుషార్ కుమార్ డొనేషన్ డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. ఈ సందర్భంగా తుషార్‌ను వెంకయ్య సన్మానించి, అభినందించారు.
News February 18, 2025
రేపటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

AP: నంద్యాల(D) శ్రీశైలం క్షేత్రంలో రేపటి నుంచి MAR 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. రేపు ఉ.9గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, రథోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 23న స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున CM CBN పట్టువస్త్రాలు సమర్పిస్తారు.