News March 21, 2024
6,100 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE
AP: రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే DSC పరీక్షల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. అనుమతి వచ్చే వరకు టెట్ పరీక్షల ఫలితాలను ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించామన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
Similar News
News September 19, 2024
తరగతి గదిలోకి టీచర్లు ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు
TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
News September 19, 2024
కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ సబ్సిడీలు, పరిహారాలు అందించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో రైతుల భూమి హక్కులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోనుంది. వారిలో ఉన్న అపోహలు తొలగించనుంది.
News September 19, 2024
జమిలితో ప్రాంతీయ పార్టీలకు దెబ్బేనా?
జమిలి ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశభద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకీ ఓటు వేసే అవకాశం ఉందంటున్నాయి. స్థానిక సమస్యలు మరుగున పడటంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి, జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశముందని ఓ సర్వేలో తేలింది.