News March 15, 2025

భద్రాద్రిలో 64 మంది మావోల లొంగుబాటు

image

TG: భద్రాద్రి జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 64 మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఇవాళ ఓ మంచి రోజు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం శుభపరిణామం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 17, 2026

కుప్పంలో అక్రమ మైనింగ్… ఇకనైనా అడ్డుకట్ట పడేనా ..!

image

కుప్పం నియోజవర్గంలో అక్రమ మైనింగ్ పరంపర కొనసాగుతునే ఉంది. రాత్రుల్లో అధికారుల కళ్లుగప్పి అటు TNకు, ఇటు KAకు రూ.కోట్లు విలువ చేసే గ్రానైట్‌ను తరలించేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ అక్రమంగా తరలిపోతుందని, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News April 17, 2026

జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

image

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారు: మిథున్ రెడ్డి

image

లోక్‌సభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా YCP MP మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. నలుగురు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.