News January 9, 2025
భూకంపం తర్వాత 646 ప్రకంపనలు
ఈ నెల 7న టిబెట్-నేపాల్ రీజియన్‌లో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి దాదాపు 126 మంది చనిపోగా, 188 మంది గాయపడ్డారు. భూకంపం తర్వాత నిన్న మధ్యాహ్నం వరకు ఏకంగా 646 ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నివాసాలు కూలిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. ప్రస్తుతం వారికి 4,300 టెంట్లను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 19, 2025
చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్ విడుదలవగా చాలా చోట్ల హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. దీంతో రిలీజైన 45వ రోజున కూడా ఓ సినిమాకు హౌస్ ఫుల్ పడటం ఇదే తొలిసారి అని సినీవర్గాలు పేర్కొన్నాయి. 20+నిమిషాలు యాడ్ అవడం సినిమాకు ప్లస్ అయినట్లు తెలిపాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
News January 19, 2025
శాంసన్‌కు CTలో నో ప్లేస్.. రాజకీయ దుమారం
సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా కెరీర్‌ను నాశనం చేశారని MP శశిథరూర్ ఆరోపించారు. ఈ విషయంలో KCAకు బాధ లేదా అని ప్రశ్నించారు. SMAT, VHTల మధ్య ట్రైనింగ్‌కు హాజరుకానందుకు చింతిస్తూ ఆయన లేఖ రాసినా వేటు వేశారని మండిపడ్డారు. ఈ విషయంపై KCA ప్రెసిడెంట్ జార్జ్ స్పందిస్తూ శాంసన్ క్రమశిక్షణ పాటించలేదన్నారు. VHTలో ఆడకపోవడం వల్లే జాతీయ జట్టుకు దూరమయ్యారనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు.
News January 19, 2025
రియల్ హీరోస్..!
రెస్టారెంట్లలో నిత్యం వేలాది టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ కాకుండా ఫుడ్‌ను అన్నార్థులకు అందించేందుకు కొన్ని NGOలు ముందుకొస్తున్నాయి. కేవలం బెంగళూరులోనే నిత్యం 296 టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అక్కడ ‘హెల్పింగ్ హీరోస్ ఇండియా’ అనే సంస్థ ఫుడ్ సేకరించి పేదలకిస్తోంది. ముంబైలో రాబిన్ హుడ్ ఆర్మీ&ముంబై డబ్బావాలా, కోల్‌కతా వీ కేర్, చెన్నై&హైదరాబాద్‌లో ‘NO FOOD WASTE’ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.