News November 18, 2024
రాష్ట్రంలో ఇంటింటి సర్వే 65.02% పూర్తి

TG: రాష్ట్ర వ్యాప్తంగా 75,75,647 నివాసాల్లో సమగ్ర సర్వే పూర్తి అయింది. దీంతో ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా 95.3శాతంతో తొలి స్థానంలో నిలిచింది. నల్గొండ 89.1, జనగామ 86 శాతం సర్వేతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. GHMCలో అతి తక్కువగా 44.3 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News December 2, 2025
నేను కోచ్గా ఉంటే బాధ్యత వహించేవాడిని: రవిశాస్త్రి

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను 0-2తో భారత్ కోల్పోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ విషయంలో గంభీర్ను ప్రొటెక్ట్ చేయనని అన్నారు. ‘అతడు 100% బాధ్యత వహించాలి. నేను కోచ్గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఓటమికి మొదటి బాధ్యతను తీసుకునే వాడిని. నిజానికి టీమ్ కూడా అంత ఘోరంగా లేదు. కానీ గువాహటిలో 100-1 నుంచి 130-7కి పడిపోయారు. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
News December 2, 2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

సౌత్ సెంట్రల్ రైల్వే(<
News December 2, 2025
పిల్లల్ని కనండి.. ఎలాన్ మస్క్ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే మానవ జాతి క్షీణించి.. అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ <<18433631>>People by WTF<<>> పాడ్కాస్ట్లో మస్క్ కీలక విషయాలు పంచుకున్నారు. “నువ్వూ పిల్లలను కనాల్సిందే” అంటూ కామత్కు సూచించారు. మనిషి మనుగడ కోసం సంతానం కొనసాగించాలని స్పష్టం చేశారు.


